మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బతికుండగానే ఓ వ్యక్తిని మార్చురీలో పెట్టి తాళం వేసిన ఘటన కలకలం రేపింది. చిన్నగూడూరుకు చెందిన టాక్సీ డ్రైవర్ రాజును గుర్తు తెలియని శవమని భావించి, రాత్రంతా మార్చురీలో ఉంచారు. ఉదయం స్వీపర్ గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడిని బయటకు తీసి ఆసుపత్రిలో చేర్పించారు. అటెండర్, ఆధార్ కార్డు లేదనే కారణంతో వైద్య సిబ్బంది అడ్మిట్ చేసుకోలేదని తెలుస్తోంది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.