ఆలూరు: మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు చేయాలి

రాయికల్ మండలంలోని ఆలూరు గ్రామ మత్స్య పారిశ్రామిక (ముదిరాజ్) సహకార సంఘం ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డికి బుధవారం జగిత్యాలలోని ఇందిరా భవన్ లో వినతిపత్రం అందజేశారు. ఆయన సానుకూలంగా స్పందించి, జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్