భగత్ సింగ్ పట్టణంలోని 36వ వార్డులో భగత్ సింగ్ యువసేన ఆధ్వర్యంలో భగత్ సింగ్ 118వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ మంత్రి టీ.జీవన్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, భగత్ సింగ్ ఆశయాలు, ఆలోచనలు,వారిలో భగత్ సింగ్ ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ యువసేన సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.