జగిత్యాల: జర్మనీ ఎలక్ట్రిషియన్ ఉద్యోగాల అవగాహనా సదస్సు

జగిత్యాల జిల్లా కేంద్రంలో టాంకాం ఆధ్వర్యంలో మంగళవారం జర్మనీ ఎలక్ట్రిషియన్ ఉద్యోగాలపై అవగాహనా సదస్సు జరిగింది. ఈ సదస్సులో సుమారు 200 మంది యువకులు పాల్గొని తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధికల్పనాధికారి బింగి సత్తమ్మ, స్టడీ సర్కిల్ డైరెక్టర్ నరేష్, సీనియర్ అసిస్టెంట్ లింగమూర్తి, జూనియర్ సహాయకులు సదానందం, కుమార్, ఆర్ ప్రసన్న, టాంకాం హైదరాబాద్ ప్రతినిధులు పాల్గొన్నారు. యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలను కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.

సంబంధిత పోస్ట్