జగిత్యాల: ఉచిత కంటి ఆపరెషన్లు చేసిన ఎమ్మెల్యే

జగిత్యాల పట్టణంలోని పావని కంటి ఆసుపత్రిలో, రోటరీ క్లబ్ జగిత్యాల సహకారంతో, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆదివారం జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 20 మంది నిరుపేదలకు ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేయించారు. అనంతరం వారికి ఉచిత కళ్ళద్దాలు, మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డా. విజయ్, అడ్వకేట్ శ్రీరాములు, టివి సూర్యం, సత్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్