జగిత్యాల: సూర్య ధన్వంతరి దేవాలయంలో షష్టి పర్వదినం ప్రత్యేక పూజలు

జగిత్యాల పట్టణంలోని చింతూకుంటలో ఆదివారం (ఆశ్వీయుజ మాసం శుక్ల పక్షం షష్టి పర్వదినం) శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో ప్రత్యేక పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్య భగవానుని విశిష్టతను వివరించారు. హిందూ సంప్రదాయంలో సూర్య భగవానుని ఆరాధించడం వల్ల ఆరోగ్యం, ఆయుష్షు, విజయం, ధనం, ప్రసిద్ధి లభిస్తాయని విశ్వాసం ఉంది. అష్టమ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో శ్రీ సూర్య భగవానునికి ప్రత్యేక పూజలు అనంతరం పల్లకి సేవ జరిగింది.

సంబంధిత పోస్ట్