కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం జగిత్యాలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచే భక్తుల రద్దీ నెలకొంది. పెద్ద సంఖ్యలో భక్తులు దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగిత్యాల పట్టణంలోని మార్కెండేయ ఆలయం భక్తులతో నిండిపోయింది. తెల్లవారుజామున తులసి మొక్కలకు పూజలు చేసిన భక్తులు, సమీప ఆలయాల్లో బ్రాహ్మణులకు దీప దానాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.