కార్తీక పౌర్ణమి సందర్భంగా జగిత్యాలలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే భక్తుల రద్దీ నెలకొంది. పెద్ద సంఖ్యలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జగిత్యాల పట్టణంలోని భక్త మార్కెండేయ దేవాలయం భక్తులతో నిండిపోయింది.