జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శివయ్యకు దీపారాధన చేస్తున్నారు. భక్తుల కోరికలు తీర్చే శివయ్యకు అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఈ పవిత్రమైన రోజున భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు.