కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలో శ్రీ నవదుర్గా మండలి (కసిర్) ఆధ్వర్యంలో శనివారం దుర్గామాత మండపం వద్ద కుంకుమ, అర్చన పూజ జరిగింది. ఈ ప్రత్యేక పూజల్లో 100 మంది మహిళలు పాల్గొని, కుటుంబ సౌఖ్యం, ఐశ్వర్యం కోసం కుంకుమ అర్పించి ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో చెందు పంతులు, దుర్గా మండలి సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.