జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ బీ ప్రకాష్ ఆకస్మిక తనిఖీ

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం చౌలమద్ది పశువైద్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ బీ ప్రకాష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పశువులకు గాలి కుంటువ్యాధి నివారణ టీకాల వివరాలు, టీకాలకు సంబంధించి ఆన్లైన్ అప్లోడింగ్ వివరాలను అడిగి తెలుసుకుని రికార్డ్స్ పరిశీలించారు. మెరుగైన పశువైద్య సేవలు అందించాలని, పశువైద్య కేంద్రం ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. చౌలమద్ది పశువైద్య ఆవరణలో మొక్కను నాటి అనంతరం పశువైద్య డాక్టర్ సిబ్బంది అందిస్తున్న సేవలను అభినందించారు. కార్యక్రమంలో పశువైద్యాధికారి డా. మనీషా పటేల్, పశువైద్య సహాయక సిబ్బంది రమాదేవి, చిరంజన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్