కోరుట్ల: ప్రజలకు సేవా చేస్తున్న డాక్టర్లకు సన్మానం

జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రభుత్వ డాక్టర్లు, ఆర్‌ఎంపీ డాక్టర్లను శాలువాలుతో ఘనంగా సన్మానించారు. వైద్యాన్ని వృత్తిగా కాక, మనుషుల ప్రాణాలను కాపాడే మహత్తర సేవగా అందిస్తున్న డాక్టర్లకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్