దుర్గామాతకు బోనాలు సమర్పించిన మహిళలు

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ దుబ్బవాడలో ఆదివారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహిళలు భక్తిశ్రద్ధలతో దుర్గామాతకు బోనాలు సమర్పించారు. పోతురాజుల పెద్దపులిల విన్యాసాలు, డీజే డప్పు చప్పుళ్ల మధ్య స్వాములు చేసిన నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. పటేల్ యూత్ దుర్గాదేవి మండపం నిర్వాహకుల బృందం కూడా పాల్గొంది.

సంబంధిత పోస్ట్