రాజస్థాన్‌ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం కురిసిన భారీ వర్షానికి జైపూర్‌లో ఉన్న చారిత్రక అమెర్ ఫోర్ట్‌కు చెందిన 200 అడుగుల పొడవైన గోడ కుప్పకూలింది. ఈ గోడలోని ప్రధాన భాగం వర్షాలకు కొట్టుకుపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో 10సెంటిమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.