భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గురువారం మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారు. భారత్–రష్యా సంబంధాలపై చర్చించారు. రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ఉత్పత్తులపై 50% టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీ అనంతరం జైశంకర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఉక్రెయిన్ విషయంలో తాజా పరిణామాలను తనతో పంచుకున్నందుకు పుతిన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.