JEE Main 2026 మొదటి సెషన్ పరీక్షలకు NTA రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అక్టోబర్ 31న ప్రారంభమైన దరఖాస్తుల సమర్పణ.. నవంబర్ 27, 2025 వరకు కొనసాగుతుంది. క్రెడిట్, డెబిట్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. పరీక్ష వచ్చే ఏడాది జనవరి 21 నుంచి 30 వరకు జరుగుతుంది. సెషన్ 2 ఏప్రిల్ 1 నుంచి 10 వరకు ఉంటుంది. ఫలితాలు ఫిబ్రవరి 12న విడుదలవుతాయి. NIT, IIIT, CFTIలలో ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు.