సీనియర్ విద్యార్థినిపై జూనియర్ అత్యాచారం

కర్ణాటకలొనీ బెంగళూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్‌లో ఒక జూనియర్ విద్యార్థి తన సీనియర్ అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతరం నిందితుడు బాధితురాలికి ఫోన్ చేసి 'నీకు పిల్ కావాలా?' అని అడిగాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అక్టోబర్ 10న మధ్యాహ్నం లంచ్ బ్రేక్ సమయంలో ఈ సంఘటన జరిగినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది.

సంబంధిత పోస్ట్