బాన్సువాడ మండలం బుడిమి గ్రామంలో శనివారం మహిళలు అట్ల బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. సాయంత్రం గునక, తంగేడు, బంతి, చామంతి పువ్వులతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ పాటలు పాడుతూ, ఆటలాడుతూ సంబరాలు చేసుకున్నారు. గతంలో కాగితాలతో బతుకమ్మలు చేసేవారు, కానీ ఈసారి గ్రామం మొత్తం పూలతో చేసిన బతుకమ్మలతో అట్ల బతుకమ్మ ఆడి, అనంతరం చెరువులో నిమజ్జనం చేశారు.