బాన్సువాడ ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్ మృతి

బాన్సువాడ ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్ డేవిడ్ రజినీష్(45) ప్రమాదవశాత్తు మృతి చెందారు. శనివారం సాయంత్రం విధులు ముగించుకుని బోధన్ లోని ఇంటికి వెళ్లిన అనంతరం బాత్రూంలో కాలు జారిపడినట్లు సమాచారం. తీవ్ర గాయలైన ఆయనను నిజామాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందినట్లు తోటి ఉద్యోగుల తెలిపారు. రజీనీష్ మృతి పట్ల ఉద్యోగులు సంతాపం ప్రకటించారు.

సంబంధిత పోస్ట్