బాన్సువాడ ఎమ్మెల్యే పరిగ శ్రీనివాస్ రెడ్డి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(1)(ఏ) ప్రకారం అనర్హతకు గురైన నేపథ్యంలో, ఈ అంశంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డిని సోమవారం జాతీయ రైతు సంఘాల సమైక్య, తెలంగాణ రైతు సమైక్య శాఖ అధ్యక్షులు సోమశేఖర రావు కోరారు. ఆర్టికల్ 192 ప్రకారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ద్వారా రాష్ట్ర గవర్నర్ కి సత్వరమే సూచనలు, సలహాలు అందించి అనర్హతపై నిర్ణయం తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.