బాన్సువాడలో విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, క్విజ్ పోటీలు

తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్ బాన్సువాడ ఆధ్వర్యంలో మంగళవారం బాన్సువాడ మండలంలోని బోర్లం పాఠశాలలో మండల స్థాయి వ్యాసరచన, ఉపన్యాస, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో 13 ఉన్నత పాఠశాలల నుండి 78 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఉపన్యాస పోటీలలో కోనాపూర్ విద్యార్థిని శైలజ, వ్యాసరచనలో కోనాపూర్ విద్యార్థిని అలేఖ్య, క్విజ్ లో బోర్లం విద్యార్థి రాము జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ, వెంకటేశం, రాఘవేంద్రరావు, శ్రీమతి సంతోషి, లక్క నరహరి, పిఆర్టియు జిల్లా అధ్యక్షులు కుశాల్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్