కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ మండల కేంద్రంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు, ఆపరేషన్ సింధూర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేయగా, పోలీసులు వారిని పక్కకు తరలించారు. ఎమ్మెల్యే వాహనం వెళ్లే సమయంలో నాయకులు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.