కామారెడ్డి జిల్లా జుక్కల్ సెగ్మెంట్ నిజాంసాగర్ మండలంలో నిజాంకాలం నాటి 17.802 టిఎంసీల సామర్థ్యం గల నిజాంసాగర్ ప్రాజెక్టులో వరద కొనసాగుతోంది. బుధవారం ఉదయం ప్రాజెక్టులోకి 9,570 క్యూసెక్కుల వరద వస్తుందని ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టులో 1405 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టాన్ని కొనసాగిస్తూ, వస్తున్న వరదను 2 గేట్లు ఎత్తి మంజీరా ద్వారా గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.