పోచారం ప్రాజెక్టులోకి 591క్యూసెక్కుల వరద

గురువారం పోచారం ప్రాజెక్టులోకి 591 క్యూసెక్కుల వరద వస్తుందని ప్రాజెక్టు డీఈ షేర్ల వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రాజెక్టులోకి వస్తున్న వరద మొత్తం మంజీరా నది ద్వారా నిజాంసాగర్ జలాశయంలోకి వెళ్తోంది. 1.820 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టులోకి గత 60 రోజుల్లో 28.866 టీఎంసీల వరద వచ్చి కొత్త చరిత్ర సృష్టించింది. ఈ వరద వల్ల ప్రాజెక్టు మట్టి కట్ట కొట్టుకుపోయింది.

సంబంధిత పోస్ట్