ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం మహిళలు అట్ల బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. నూతన వస్త్రాలు ధరించి, సుందరంగా ముస్తాబై, పట్టణంలోని బిసి కాలనీ, న్యూ అబాది టీచర్స్ కాలనీతో పాటు పలు కాలనీల్లో తంగేడు, గునుక పూలు, బంతి పూలతో బతుకమ్మలను తయారుచేశారు. సౌండ్ సిస్టం ఏర్పాటు చేసి, 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో' అంటూ మహిళలు లయబద్దంగా బతుకమ్మ ఆటలు ఆడారు. అనంతరం గ్రామాల్లోని చెరువుల్లో, పట్టణ శివారులోని పెద్ద చెరువులో, సమీప పోచారం ప్రధాన కాలువలో మహిళలు బతుకమ్మలను నిమజ్జనం చేశారు.