లింగంపేట్లో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం

లింగంపేట్ మండల కేంద్రంలో ఆదివారం బీజేపీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి 'ఆపరేషన్ సిందూర్'ను అపహాస్యం చేసే విధంగా మాట్లాడారని, ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ మండల అధ్యక్షుడు బొల్లారం క్రాంతికుమార్ డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు జక్సాని దత్తు రాములు, జిల్లా కౌన్సిల్ మెంబర్ వడ్ల రామచంద్ర చారి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు రాజారాం బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్