పోచారం ప్రాజెక్టులోకి కొనసాగుతున్న స్వల్ప ఇన్ఫ్లో

ఎల్లారెడ్డి సెగ్మెంట్ లోని నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టులోకి స్వల్ప వరద కొనసాగుతోంది. ఆదివారం ప్రాజెక్టులోకి 782 క్యూసెక్కుల వరద వస్తుందని ప్రాజెక్టు డీఈ. షేర్ల వెంకటేశ్వర్లు తెలిపారు. ఇన్ఫ్లో మొత్తం కట్టపై నుండి మంజీరలో పడి నిజాంసాగర్ ప్రాజెక్టు జలాశయంలోకి వెళ్తుంది. 1.820 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులోకి గత 70 రోజులుగా 29.070 టీఎంసీల వరద వచ్చి చరిత్ర సృష్టించింది. ప్రాజెక్టు నిర్మాణం నుండి ఇంత భారీ స్థాయిలో ఖరీఫ్ లో వరద రావడం ఇదే ప్రథమం.

సంబంధిత పోస్ట్