పురోహితుల సూచనల మేరకు, ఎల్లారెడ్డిలో అక్టోబర్ 3న దుర్గామాత శోభాయాత్ర ప్రారంభించి, 4న ఉదయం వరకు నిమజ్జనం శాంతియుతంగా పూర్తి చేయాలని 11 దుర్గమండళ్ల అమ్మవారి మాల ధారణ చేసిన స్వాములు ఆదివారం నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు. దుర్గామాత శోభాయాత్రను సాంప్రదాయ పద్ధతులతో ప్రారంభించి, నిమజ్జనం పూర్తి చేయాలని తీర్మానించారు. ఈ సమావేశంలో ప్యాలాల రాములు, పిన్నూరి రమేష్, శంభు, తులసీదాస్, శివప్రసాద్, సోమయాజుల సాయి, ఓలపు సాయి, భరత్, భాను ప్రసాద్, ఫణింద్ర ప్రసాద్, కుక్కల ప్రశాంత్ పాల్గొన్నారు.