ఎల్లారెడ్డి: నాణ్యమైన భోజనం అందించాలి: ఆర్డీవో

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ ఆదేశించారు. ఎల్లారెడ్డి ఎస్సీ వసతి గృహాన్ని ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. అక్కడ విద్యార్థులకు వండుతున్న వంటలను పరిశీలించారు. అనంతరం స్టాక్ రూమ్ లో ఉన్న సరకులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని సూచించారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్