ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని వైశ్యభవన్ లో గల కన్యాకాపరమేశ్వరి ఆలయంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గమాతని మహాలక్ష్మి అవతరంలో కొలుస్తూ పూజలు చేశారు. పూజల అనంతరం పట్టణంలోని ప్రముఖ వ్యాపారి ముత్యపు లింగం భక్తులకు పెద్ద ఎత్తున అన్నప్రాసద వితరణ చేసారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, ఆర్యవైశ్య ప్రతినిధులు, వ్యాపారస్తులు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.