అయ్యప్ప ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించిన ఆలయ కమిటీ

ఎల్లారెడ్డి శ్రీశ్రీశ్రీ దగర్మశాస్త్ర అయ్యప్ప ఆలయ అభివృద్ధి పనులను సోమవారం ఆలయ కమిటీ చైర్మెన్ పద్మ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రతినిధులు పరిశీలించారు. జపాన్ శాస్త్రవేత్త డాక్టర్ పైడి ఎలారెడ్డి ఇచ్చిన నిధులతో మరుగుదొడ్ల నిర్మాణ పనులు రెండు రోజుల్లో ప్రారంభించనున్నారు. ఆలయ హుండీ దొంగలచే ధ్వంసం చేయబడటంతో మరమ్మతులు చేయించాలని నిర్ణయించారు. ఆలయ డైనింగ్ హాల్ చుట్టూ దాదాపు 2 లక్షల రూపాయల ఆలయ నిధులతో జరుగుతున్న గ్రిల్ పనులను కూడా పరిశీలించారు. కమిటీ ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్ నాథ్ ఈ పరిశీలనలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్