నాగిరెడ్డిపేట మండలంలో బుధవారం కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉసిరి, తులసి చెట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలు వెలిగించారు. తాండూర్ శివారు మంజీరా నది ఒడ్డున వెలసిన త్రిలింగ రామేశ్వర ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఎల్లారెడ్డి సివిల్ జడ్జి ఎం. సుష్మ, సిఐ. రాజారెడ్డి, ఎస్ఐ. భార్గవ్ గౌడ్ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. విద్యుత్ దీపాల కాంతుల మధ్య శివునికి ప్రత్యేక పూజలు చేశారు.