ఎల్లారెడ్డి పట్టణంలో ప్రజలు కోతులు, కుక్కలతో భయపడుతుండగా, ఇప్పుడు అడవి పందులు పట్టణంలోకి ప్రవేశించడంతో భయం మరింత పెరిగింది. సీఎస్ఐ చర్చి కాంపౌండ్లో అడవి పందుల మంద కనిపించింది. మనుషులను చూస్తే దాడికి యత్నిస్తున్నాయి. అటవీ శాఖ, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే ప్రజలకు ముప్పు తప్పదని వాదనలు వినిపిస్తున్నాయి.