మరో రెండు వారాల్లో 'కాంతార' కొత్త సినిమా రిలీజ్ కానుంది. కానీ కర్ణాటక ప్రభుత్వం మల్టీప్లెక్స్ టికెట్ ధర గరిష్ఠంగా రూ.236గా నిర్ణయించింది. చిన్న సినిమాలకు సమస్య కాకపోయినా, 'కాంతార' లాంటి చిత్రానికి పెట్టిన భారీ బడ్జెట్ తిరిగి రావాలంటే టికెట్ ధరలు పెంచాల్సి ఉంటుంది. దీంతో కాంతార నిర్మాతలు హొంబలే ఫిల్మ్స్ టికెట్ ధరలు పెంచేందుకు కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.