గడ్డి మందు తాగి వివాహిత ఆత్మహత్యా

విలాసాగర్ గ్రామానికి చెందిన బత్తిని సమ్మవ్వ, భర్త సమ్మయ్య మరణానంతరం వ్యవసాయ కూలీగా కుటుంబాన్ని పోషిస్తోంది. ఐదేళ్ల క్రితం భర్త, పది రోజుల క్రితం అల్లుడు బోసు ప్రభాకర్ మరణించడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. సోమవారం, భర్త సమాధి వద్ద కూర్చొని ఏడుస్తూ గడ్డి మందు తాగింది. అక్కడే పడిపోవడంతో, పక్క పొలంలోని అజయ్ గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమాకాంత్ తెలిపారు.

సంబంధిత పోస్ట్