చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీక మాసం మంగళవారం సందర్భంగా ఈరోజు విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తుల సందోహం కనిపించింది. అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య అభిషేకాలు, ఆర్చనలు, హనుమాన్ చలిసా పారాయణం నిర్వహించారు. పూలతో అలంకరించిన ఆలయం దీపాలతో వెలుగుల మయం అయ్యింది.