సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జాతి ఐక్యత దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా, గురువారం స్థానిక ఎస్సై వంశీకృష్ణ ఆధ్వర్యంలో మధుర నగర్ లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల విద్యార్థినిలు, సిబ్బంది, స్థానిక రాజకీయ నాయకులు, ఇతర పోలీస్ సిబ్బందితో కలిసి గంగాధర మండల కేంద్రంలో 2 కిలోమీటర్ల "వాక్ ఫర్ యూనిటీ" కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సై వంశీకృష్ణ, వల్లభాయ్ పటేల్ యొక్క ఉద్దేశాలను, ఆశయాలను విద్యార్థులకు వివరించారు.