జమ్మికుంట వ్యవసాయ మార్కెట్కు 2రోజులు సెలవులు

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్కు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి, రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ సమ్మేళనం కారణంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో, ప్రైవేటు కొనుగోళ్లతో పాటు సి.సి.ఐ కొనుగోళ్లను కూడా నిలిపివేస్తున్నట్లు మార్కెట్ ఛైర్ పర్సన్ పుల్లూరి స్వప్న, ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం తెలిపారు. రైతులు తేమలేని పత్తిని మాత్రమే మార్కెట్కు తీసుకురావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్