హుజూరాబాద్లో గులాబీ జెండా ఖాయం: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తి ఆధిక్యం సాధిస్తుందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కమలాపూర్‌లో సోమవారం జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ సంపత్ రావు, వైస్ ఛైర్మన్ ఇంద్రసేనారెడ్డి కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్