జమ్మికుంట రైల్వే స్టేషన్ లో గుర్తు తెలియని మహిళ మృతి

జమ్మికుంట రైల్వే స్టేషన్ ప్లాటుఫారం పై సుమారు 50 ఏళ్ల గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఆమె బ్రౌన్ రంగు నైటీ ధరించి ఉంది, వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేదా వస్తువులు లేవు. మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్ జమ్మికుంట మార్చరీలో భద్రపరిచారు. ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జి. తిరుపతి రామగుండం ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసినవారు 9949304574, 87126586043 నంబర్లలో సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్