జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామ శివారులో, తాటిపెళ్లి గ్రామం నుండి వడ్ల లోడ్ తో వస్తున్న ట్రాక్టర్, ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మేడిపల్లి ఎస్సై మాడ శ్రీధర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో ఆటోలో చిక్కుకున్న డ్రైవర్‌ను బయటకు తీసి, చికిత్స కోసం జగిత్యాలలోని ప్రధాన ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ఆటో డ్రైవర్ స్థానిక కొండాపూర్ గ్రామ నివాసి అని తెలిసింది.