కామారెడ్డి జిల్లా డోంగ్లి క్లస్టర్ లో ఏఈవోగా పనిచేస్తున్న బస్వ రాజు, అధిక పనిభారం కారణంగా సెప్టెంబర్ 5న గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనపై జగిత్యాల జిల్లా ఏఈవోలు సోమవారం ఆయనకు నివాళులర్పించి, నిరసన తెలిపారు. అనంతరం డీఏవో భాస్కర్ కు వినతిపత్రం అందజేశారు. మృతుడు బస్వ రాజుకు తన క్లస్టర్ తో పాటు అదనపు క్లస్టర్ బాధ్యతలు ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురై మృతి చెందాడని తెలిపారు.