జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్లో నిన్న సహస్ర అనే 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. తన అక్క కూతురి మరణానికి తండ్రి రవి, సవతితల్లి సవిత, అత్తామామలు, మరిదినే కారణమని మృతురాలి పిన్ని, అమ్మమ్మ ఆరోపించారు. బాలికను వేధించి చంపేశారని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదైంది.