సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిపై జరిగిన దాడిని నిరసిస్తూ జగిత్యాల జిల్లా న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కోర్టు విధులను బహిష్కరించారు. న్యాయవాదులు నల్ల బ్యాడ్జిలు ధరించి, ర్యాలీగా బయలుదేరి తహసీల్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిరుదుల లక్ష్మణ్, ఎండీ సలీమ్, కూర్మాచలం ఉమా మహేష్, గుడికందుల మహేష్, చిర్ర దిలీప్, కరుణాకర్ పాల్గొన్నారు.