జగిత్యాల రూరల్ మండలం పోలాస పౌలేష్తేశ్వర స్వామి ఆలయంలో నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకారం శనివారం జరిగింది. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరై నూతన ధర్మకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పాలేపు రాజేంద్ర ప్రసాద్, ధర్మకర్తలు భారతపు భూమన్న, అనుపురపు సత్యనారాయణ, మర్రిపెల్లి కొండల్ రావు, రంగు రాజయ్య, కొండపల్కల వినీత, డా. పుట్ట నాగరాజు, అర్చకులు రామోజ్వల గోవర్ధన్ పాల్గొన్నారు.