రాష్ట్ర ప్రభుత్వం జీవో ఆర్టీ నెం. 219 ద్వారా కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీని 4వ పాలకవర్గంగా పునర్వ్యవస్థీకరించింది. బీసీ (జనరల్) కు రిజర్వ్ చేసిన చైర్మన్ పదవికి ఆకుల నర్సయ్య, వైస్ చైర్మన్‌గా సుడగోని లక్ష్మీ నారాయణ గౌడ్ నియమితులయ్యారు. పంజాల శ్రీనివాస్ గౌడ్, బొనాల శ్రీనివాస్, ఖాజా, రుద్ర రాము, మీసాల శంకర్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ రెండేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతుంది.