కరీంనగర్ లో దుర్గాదేవికి చండీ రూపంలో పూజలు, అన్నదానం

కరీంనగర్ పట్టణంలోని 24వ డివిజన్ మెహర్ నగర్ లో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఆదివారం 6వరోజున అమ్మవారు చండీరూపంలో పూజలందుకున్నారు. అర్చకులు శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో చండీ హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్