విద్యుత్ వైర్ల సమస్య.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు

మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లి గ్రామానికి చెందిన ఆకుల గోపాల్ అనే రైతు, తన ఇంటిపై నుంచి వెళ్తున్న విద్యుత్ వైర్ల సమస్యపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన రాకపోవడంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయంపై వివరణ కోరగా, ఏఈ పై అధికారులతో మాట్లాడి వైర్లను ఇంటి మూల నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్