తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మకు హైదరాబాద్లో స్థిరపడ్డ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు పల్లెలకు బాట పట్టడంతో శనివారం తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీ నెలకొంది. సద్దుల బతుకమ్మ సోమవారం, రేపు ఆదివారం కావడంతో ఆడబిడ్డలు ముందుగానే గ్రామాలకు సొంత వాహనాలతో వస్తుండడంతో భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి టోల్ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.