గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామ శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా మొరం రవాణా చేస్తున్న రెండు టిప్పర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం మేరకు రాత్రి దాడి చేసిన గన్నేరువరం ఎస్సై, మొరం తో ఉన్న ఒక టిప్పర్, మొరం లేకుండా ఉన్న మరో టిప్పర్ ను పట్టుకున్నారు. అనంతరం వాటిని పోలీస్ స్టేషన్కు తరలించి, తదుపరి చర్యల కోసం కరీంనగర్ జిల్లా మైన్స్ అండ్ మినరల్స్ శాఖాధికారులకు అప్పగించారు.